నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...డీకే అరుణ
posted on Mar 10, 2015 11:38AM

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలలో ఎవరికి వాళ్లు వాళ్ల నోటి పవర్ ను చూపించుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ మహబూబ్ నగర్ జిల్లా గుర్రంగడ్డ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆమె అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో అసలు గొడవ మొదలైంది. డీకే అరుణ మాట్లాడుతూ... టీఆర్ఎస్ సభ్యులను నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్.. మహిళలతో పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ మండిపడ్డారు. ఈ మాటలకి ఐటీ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకొని మీ దాదాగిరి ఏదైనా ఉంటే మహబూబ్ నగర్ లో చూసుకోండి ఇక్కడ చూపించకండి అని అన్నారు.