ఏపీలో 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు

 

కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లోని నగరాలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఆ పురస్కారాలు దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమండ్రి ఎంపికైంది. 

స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ర్టంలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంద్ర కార్యక్రమాల కారణంగానే ఈ అవార్డులు దక్కాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులు, పారిశుద్ద సిబ్బంది, సహకరించిన ప్రజలకు పట్టాభి అభినందనలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu