సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్వాతిని చంపింది వీడే..?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఒక ఫోటోను విడుదల చేశారు. చెన్నై చూళైమేడుకు చెందిన స్వాతి చెంగల్పట్టు సమీపంలోని ఇన్సోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తోంది. రోజూ సబర్బన్ రైలులో ప్రయాణించి ఆఫీసుకు వెళ్లి వస్తుండేది. గత శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఆఫీసుకు వెళ్లేందుకు రైలు కోసం నిరీక్షిస్తున్న స్వాతిని గుర్తు తెలియని వ్యక్తి వేటకొడవలితో దారుణంగా హత్యచేసి పారిపోయాడు.

 

ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం కలిగించింది. తమిళనాడు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా దుమ్మెత్తిపోశాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్‌తో పాటు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని విశ్లేషించి అనుమాతుడి ఫోటోని విడుదల చేశారు. అయితే అది అంత స్పష్టంగా లేకపోవడంతో ఈ రోజు మరింత స్పష్టమైన ఫోటోను మీడియాకు అందజేశారు. ఈ ఫోటో ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అటు స్వాతికి న్యాయం జరగాలని, మహిళలకు భద్రత పెంచాలని కోరుతూ ఇవాళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu