నేడు 11 గంటలకు టెన్త్ 2012 పరీక్ష ఫలితాలు

నేడు పదోతరగతి పరీక్ష ఫలితాలు ఉదయం 11 గంటలకు సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు.ఈసారి ఫలితాల్లో విద్యార్థుల మార్కులను వెల్లడించడం లేదు.మార్కుల రేంజ్‌ను బట్టి సబ్జెక్టుల వారీగా నిర్ణీత గ్రేడ్లతోపాటు ప్రతి గ్రేడ్‌కు గ్రేడ్ పాయింట్ ఇస్తారు. ఆ పాయింట్లను కలిపి, సబ్జెక్టుల సంఖ్యతో భాగించి గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ పాయింట్లు) ఇస్తారు. మెమోల్లో ఓవరాల్ గ్రేడ్ ఉండదు. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతోపాటు జీపీఏ మాత్రమే ఉంటుంది. ఫలితాల వెల్లడి అనంతరం మీ-సేవా, ఏపీ ఆన్‌లైన్‌లో విద్యార్థులు తీసుకునే కాపీల్లో సబ్జెక్టుల వారీ గ్రేడ్‌తోపాటు జీపీఏ పాయింట్లు ఉంటాయి. ఫెయిల్ అయిన వారికి, ఆయా సబ్జెక్టులకు ‘ఇ’ గ్రేడ్ ఇస్తారు. గ్రేడ్ పాయింట్లు ఇవ్వరు. పాస్ అయిన విద్యార్థికి వెబ్‌సైట్లలో మాత్రం హాల్ టికెట్ నంబరు పక్కనే జీపీఏ ఇస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu