'బలుపు' రెస్పాన్స్ పై శ్రుతి హాసన్ ట్విట్
posted on Jun 29, 2013 10:50AM

మాస్ మహారాజ రవితేజ నటించిన 'బలుపు' మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో బలుపు యూనిట్ సభ్యులు ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు.
'బలుపు' సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని తెలియజేసింది. బలుపు సినిమా సక్సెస్ ట్యాంక్ ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఈ సినిమాని సక్సెస్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. శ్రుతి హాసన్ కి తెలుగులో రెండో విజయం ఇది. వరుసు ప్లాపులతో ప్రేక్షకులను నిరాశపరుస్తూ వచ్చిన రవితేజ ‘బలుపు'తో వారి మనసు గెలిచాడని చెప్పొచ్చు.