జగన్ మెడకు హోదా ఉచ్చు .. రాష్ట్రపతి ఎన్నిక తెచ్చిన తంటా!

అవును కావచ్చును, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ /కూటమికి మద్దతు ఇవ్వాలి .. ఎవరికి ఓటు వేయాలి... అనేది ఆయా పార్టీల ఇష్టం కావచ్చును ,కానీ,రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పార్టీలు, ప్రజా ప్రతినిధులు ప్రజల ఆశలు, ఆకాంక్షలు,  మనోభావాలను గుర్తించి, గౌరవించి అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా పార్టీలు నిర్ణయం తీసుకుంటే అది ప్రజల తీర్పును వమ్ము చేయడమే అవుతుంది.  

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, ఐదు కోట్ల తెలుగు ప్రజలను ఎవరిని, అడిగినా, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకటే మాట చెపుతారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎపీ ప్రజాప్రతినిధులు బీజేపీ/ఎన్డీఎ కూటమికి హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామనే షరతు విధించాలని అంటారు. మరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ఈ డిమాండ్ ను రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసే పార్టీలు, అభ్యర్ధుల ముందు ఉంచగలుగుతుందా? ముఖ్యంగా, గెలుపు అంచున నిలిచి, వైసీపీ ఓట్లపై అసలు పెట్టుకున్న బీజేపీని వైసీపే  డిమాండ్ చేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. బీజేపీ/ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి నెగ్గాలి అంటే వైసీపీ ఓట్లు తప్పని సరి.

 ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే బలం ఉన్న వైసీపీ ఓటు వేస్తుందా..? అలాంటప్పుడు తమ మద్దతు ప్రకటించాలి అంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా లోకేష్, గతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  కేద్రంలో బీజేపీకి పూర్తి బలం ఉంది. ఇలాంటి సమయంలో వేడుకోవడం తప్ప డిమాండ్ చేయలేం అని అన్నారు,

కానీ ఇప్పుడు  బీజేపీకి వైసీపీ అవసరం వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు ఓటములకు  వైసీపీ ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే ఈ డిమాండ్ ను వైసీపీ వినియోగించుకోవాలని లోకేష్  డిమాండ్ చేశారు.అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం, ప్రత్యేక హోదా సాదించేందుకు రాష్ట్రపతి ఎన్నిక వైసీపీకి సువర్ణ అవకాశం కల్పించిందని అభిప్రాయపడుతున్నారు. అయితే, వైసీపీ ఈ సువర్ణ  అవకాశాన్ని ఎంత వరకు ఉపయోగించు కుంటుంది, అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

ఈ నేపధ్యంలోనే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్టర్ వేదికగా, ముఖ్యమంత్రి జగన రెడ్డికి సవాలు విసిరారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని వైసీపీ రాజస్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి  ట్వీట్ చేశారని లోకేష్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తారనే ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలను ఇచ్చారన్నారు. ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే.. ఆ పని చేయండి అంటూ ట్వీట్’ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి? అంటూ లోకేష్ ప్రశ్నించారు.

ఈ మేరకు గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు.కాగా, రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15వ తేదీన జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉండనుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu