మాజీ ప్రధానికి 6 నెలల జైలు శిక్ష
posted on Jul 2, 2025 4:04PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ 6 నెలలు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెకు ఈ శిక్ష వేసింది. గతేడాది బంగ్లాలో అల్లర్లతో దేశం విడిచి పారిపోయిన ఆమెపై అక్కడి ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వాటి విచారణకు హాజరుకాకపోవడంతో హాసీనాకు జైలు శిక్ష విధించింది. హసీనాతో పాటు.. గైబంధలోని గోవిందగంజ్ కు చెందిన షకీల్ అకాండ్ బుల్బుల్ కుకూడా ట్రిబ్యునల్ అదే తీర్పులో 2 నెలల జైలు శిక్ష విధించింది.
11 నెలల క్రితం పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి పారిపోయిన అవామీ లీగ్ మాజీ నాయకురాలికి పడిన తొలి శిక్ష ఇదే, గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.