ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

 

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు విజయవాడ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై  విడుదలయ్యారు. ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో  140 రోజులు జైలు జీవితం అనంతరం బయటకు వచ్చారు. ఫిబ్రవరి12న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన వంశీపై పలు సందర్బాల్లో 11 కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu