రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా...

 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఇసుక పాలసీ సామాన్యులకు చుక్కలు చూపిస్తూ దళారులకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి పి.గన్నవరంలో కొందరు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మారాయి. నియోజకవర్గంలో ఉన్న నాలుగు ర్యాంపుల్లో సాధారణ ప్రజలకు ఇసుక దొరకటం గగనమైంది .కావాలంటే బ్లాక్ లో కొనుక్కోండి అంటు సలహాలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక దొరక్కపోగా రెట్టింపు ధరకు బ్లాక్ లో కొనాల్సి వస్తోంది. పి.గన్నవరం నియోజక వర్గంలో అధికారికంగా పలు సొసైటీల పేరుతో నాలుగు ర్యాంప్ లకు ఆధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్టర్ ఇసుక ధర పదహారు వందల ఎనభై ఏడు రూపాయలు కానీ ఎక్కడా ఈ ధరకు ఇసుక దొరకటం లేదు. రెండు ర్యాంపుల్లో అధికారిక పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు చక్రం తిప్పుతున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆన్ లైన్ సేవలు మొరాయించాయి అన్న నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా సరిహద్దులు దాటిస్తున్నారు. స్థానికులకు ఆన్ లైన్ తో సంబంధం లేకుండా ఇసుక ప్రభుత్వ ధరకు విక్రయించాలని అధికారులు సూచించారు. ఇదే వారి దోపిడీకి దారి చూపించింది ,స్థానికులకు అమ్ముతున్నట్లు లెక్కల్లో చూపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులకు కావాలన్నా బ్లాక్ లో కొనాల్సిందే. అనధికార స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అధిక ధరలకు అమ్ముతున్నారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా వాహనాలకు జీపీఎస్ అమర్చి అక్రమాల నిరోధిస్తామన్న ఆధికారులు కనుచూపు మేరలో కనిపించడం లేదంటన్నారు. స్థానికంగా ఎవరైనా ఇసుక  కావాలంటే కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ధర చెబుతున్నారు. ప్రజలు కూడా బ్యాంకులు అధికారుల చుట్టూ తిరగలేక అవసరానికి బ్లాక్ లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu