జగన్ కేసు: సబితాను ప్రశ్నించిన సిబిఐ

 

 

 

పెన్నా సిమెంట్ కంపెనీకి గనుల కేటాయింపు వ్యవహారంలో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. దిల్‌కుషాలో ధర్మానను ప్రశ్నించిన సమయంలోనే సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబిత.. పలు గనుల లీజులను పెన్నాకు కేటాయించారు. వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడైన పెన్నా ప్రతాపరెడ్డి.. ఇందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని కోర్టుకు సీబీఐ తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీటు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో సబితను ప్రశ్నించి.. సీబీఐ అధికారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకొన్నారు.