రాయల తెలంగాణకే కేంద్రం మొగ్గు

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్నాళ్లు వివిధ ఆఫ్షన్లను పరిశీలించిన కేంద్ర ఇప్పుడ ఫైనల్‌గా రాయల తెలంగాణకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని పది జిల్లాలతో పాటు అనంతపురంచ కర్నూల్‌ జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని జీవోయం సభ్యులు గాని కాంగ్రెస్‌ పెద్దలు గాని అధికారకంగా ధృవీకరించకపోయినా దాదాపు ఇదే కాయం అన్న వాదన మాత్రం డిల్లీలో బలంగా వినిపిస్తుంది. అయితే బిజిపితో పాటు తెలంగాణ కోరుతున్న పార్టీలన్ని రాయల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి.

ఈ నేపద్యంలో కేంద్ర ఎలా వ్యవహరిస్తుంది అన్న అంశం ఆసక్తిగా మారింది. పార్లమెంట్‌ సమావేశాలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన అంశాలపై కేంద్ర మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం అని జీవోయం సభ్యులు చెపుతున్నా.. అది అసాధ్యం అంటున్నారు కొందరు కేంద్ర మంత్రులు.