నిరాహార దీక్షకు దిగనున్న రమణ దీక్షితులు..!

 

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే  ఢిల్లీకి వెళ్లి హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తిరుమలలో జరుగుతున్న విషయాలపై ఫిర్యాదు చేసిన ఆయన ఇప్పుడు తన దూకుడిని మరింత పెంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, వారి వైఖరితో శ్రీవారి సంపద కొల్లగొట్టబడుతోందని.. ఈ నేపథ్యంలో టీటీడీ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆభరణాలు అదృశ్యం కావడం, స్వామివారికి సేవల్లో లోపం జరుగుతుండటంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu