జల్లికట్టుపై వర్మ...మానవ రూపంలో ఉన్న రాబందులు
posted on Jan 21, 2017 2:16PM
.jpg)
జల్లికట్టుపై తమిళులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జల్లికట్టుపై ఇప్పటికే పలువురు స్పందించగా.. ఇప్పుడు తాజాగా వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వం సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం కూడా నేరమని, సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని సమర్థిస్తోంది. ఆ ఎద్దులు చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు తొలగి, ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణించటం అనాగరికం..అమాయక జీవులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అనే ముసుగు వేయడం దారుణమని అన్నారు. అక్కడితో ఆగకుండా.. జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్నవారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టును సమర్ధిస్తున్న ప్రతి ఒక్కరి మీదకు 100 ఎద్దులను వదలి ఆ తరువాత వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి...అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే అల్ఖైదా కూడా కరెక్టే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలకు తమిళిలు ఎలా స్పందిస్తారో చూడాలి.