చెన్నై వరదలపై రాజ్ నాథ్ సింగ్


 

చెన్నై నగరం భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. ఈ వరదలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రటకన చేశారు. చెన్నైలో భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 269 మంది చనిపోయారని..ఏపీలో వరదల వల్ల 54 మంది చనిపోయారని తెలిపారు. చెన్నైలో 40 శాతం కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతిందని.. చెన్నైలో వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అందిస్తోందని అన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu