దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ అమెరికా పర్యటన...

 

దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. భారత విజయాల్ని ప్రపంచానికి చాటడానికి మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ప్రవాస భారతీయులతో హ్యూస్టన్ లో ఆత్మీయ భేటీ, ట్రంప్ తో విస్తృత చర్చలు, ఐక్యరాజ్య సమితిలో కీలక ప్రసంగాలు ఇలా బిజీ బిజీగా సాగనుంది. మోదీ చోర్ పెట్టుబడుల ఆకర్షణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరారు.

వారం రోజుల పాటు హ్యూస్టన్ న్యూయార్క్ నగరాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మోదీ వెళ్లేది రెండు నగరాలకే అయినా తీరిక లేని విధంగా సమావేశాలు సదస్సులు, చర్చల్లో భాగస్వాములు కానున్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితినే సంస్కరించి అందులో భారత్ కు కీలక స్థానం లభించేలా ఒప్పించడం పర్యటన ఎజెండాలో ముఖ్యోద్దేశం. రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఆరోసారి. రెండోసారీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం హ్యూస్టన్ నగరంలో ప్రవాస భారతీయులతో హౌడీ మోదీ పేరుతో జరిగే భారీ సభ ఈ పర్యటనలో కీలకం.

అమెరికాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది మూడవసారి. రెండు వేల పద్నాలుగులో తొలిసారి న్యూయార్క్ నగరంలోని మ్యాడిసెన్ స్క్వేర్ లో రెండో సారి రెండు వేల పదిహేను లో కాలిఫోర్నియా లోని శాన్ జోస్ సబ్ సెంటర్ లలో ప్రసంగించారు. అమెరికా సమాజానికి ఆర్థికంగా భారతీయులు అందిస్తున్న తోడ్పాటును చాటిచెప్పేలా సాగే హ్యూస్టన్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు అధికార డెమోక్రటిక్ ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీల నాయకులు పాల్గోనున్నారు.

వచ్చే ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో అత్యంత ప్రభావవంతమైన భారతీయ సమాజాన్ని ఆకర్షించటం కోసం దేశ నాయకుల దీనిలో మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే కాంగ్రెస్ సభ్యులతో మోదీ ప్రత్యేకంగా ఇష్టాగోష్టిగా మాట్లాడనున్నారు. తర్వాత న్యూయార్క్ బయలుదేరి వెళ్తారు, అక్కడ ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.