పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సభ

 

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తూ చేసిన రెండు గంటల ప్రసంగం ప్రజల్నిఆకట్టుకోనెలా వుంది. జెండా వుంది కాని ఎజెండా గురుంచి ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీ కార్యాచరణ, పార్టీ కోసం కార్యకర్తలు, ఫాన్స్ ఏం చేయాలి అనే దానిపై దిశానిర్దేశం చేయలేదు. దీనిని పార్టీ ఆవిర్భావ సభ అనే కంటే పవన్ వ్యక్తిగత సభ అని అనుకోవచ్చు. సామాన్య ప్రజలకు దగ్గరయ్యేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. చాలా సహజమైన దోరణిలో..యూత్ ని ఆకట్టుకోనేలా ప్రసంగించారు. కాంగ్రెస్ తో తప్ప ఇతరపార్టీలతో పోత్తుకు రెడీగా వున్నానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీతో పోత్తు పెట్టుకోవాలి అనే దానిపై ఆయనకి స్పష్టత లేనట్లుగా తెలుస్తోంది. వలసలను ప్రోత్సహించనని అన్నారు.



చిరంజీవి పెట్టిన పీఆర్పీ పార్టీకి 17శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కి మాత్రం 3 లేదా నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు మాత్రమే వున్నాయి. పవన్ తెలంగాణకు ఎక్కువగా ప్రధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసిఆర్ ను టార్గెట్ చేసి..సీమాంధ్ర ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్ద్వందంగా తనకు ఏ (కాపు) కులస్థుల మద్దతు అవసరం లేదని, ఎందుకంటే తను పదవులకోసమో, అధికారం కోసమో రాజకీయాలలోకి రాలేదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టి మళ్ళీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకే రాజకీయాలలో ప్రవేశించానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి, ఒకేసారి కాంగ్రెస్ పార్టీకి, తను అభిమానించే అన్న చిరంజీవికి, కాపు కుల నేతలకూ కూడా గట్టిగా చురకలు వేశారు.


తన పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడానికి మాత్రం పవన్ ఈ రెండు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శకులు అంటున్నారు. అయితే ఆయన పార్టీకి జనాల్లో  క్రేజ్ వచ్చిన కానీ కలెక్షన్లు (ఓట్లు) మాత్రం నీల్ అనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.