పఠాన్‌కోట్‌లో ఉగ్ర కలకలం
posted on May 4, 2017 11:05AM

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది. మిలటరీ బేస్ సమీపంలో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్యాగులును పరిశీలించిన పోలీసులు వాటిలో మొబైల్ టవర్‌కు చెందిన బ్యాటరీలను గుర్తించారు. అవి ఎక్కడి నుంచో వచ్చాయో..ఎవరు అక్కడ పెట్టారో తెలుసుకునే పనిలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనతో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. గతేడాది జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొరబడి ఏడుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. మళ్లీ కొద్దిరోజుల క్రితం బెర్హంపూర్ చెక్‌పోస్ట్ వద్ద ముగ్గురు అనుమానిత వ్యక్తులు కారుతో కలకలం రేపారు..తాజాగా ఇవాళ అనుమానాస్పద బ్యాగులు లభించడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.