దిగొచ్చిన కేజ్రీవాల్.. కుమార్ విశ్వాస్ డిమాండ్లకు ఓకే..
posted on May 3, 2017 5:51PM

ఆప్ పార్టీ కీలక నేత కుమార్ విశ్వాస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తాను పార్టీలో ఉండాలంటే మూడు షరతులకు ఒప్పుకోవాల్సిందే అని కడీషన్స్ కూడా పెట్టారు. అయితే దీనికి ఆప్ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారబ్బా అని అనుకున్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం కుమార్ విశ్వాస్ విషయంలో దిగొచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్‌ను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చర్చల తర్వాత బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉంటారని చెప్పారు.
కాగా కుమార్ విశ్వాస్ పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. అవినీతి మరకలు ఏమాత్రం అంటని వ్యక్తి. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో.. పొరపాటున ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే సామాన్య ప్రజల్లో కూడా పార్టీ బాగా దెబ్బతింటుందని కేజ్రీవాల్ భావించారు. అదీకాక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటములు పాలవుతున్ననేపథ్యంలో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరైన కుమార్ విశ్వాస్‌ను పోగొట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని కేజ్రీవాల్ భావించారు. అందుకే పార్టీలో కొనసాగాలంటే.. అంటూ ఆయన పెట్టిన షరతులను కూడా ఆమోదించారు.