ఏపీని బీహార్ తో కలపొద్దు

 

దేశంలోని ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపిన సంగతి తెలిసిందే. బీహార్ తో పాటు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో ఇప్పటికే ఏపీలో నిరసనలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై ఎంపీ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ కు సంబంధించనవి అని ఏపీకి దీనితో సంబంధం లేదని అన్నారు. రాష్ట విభజన వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని.. ఏపీని బీహార్ తో పోల్చి చూడవద్దనిన ఆమె అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. కాగా మరోవైపు బీజేపీ చేసిన ఈ ప్రకటనను ఆసరాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తుందని... అందుకే సభ జరగనివ్వడం లేదని అన్నారు.

 

మరోవైపు ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాము రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమని రాజమండ్రి పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ అన్నారు. ఇప్పటికిప్పుడు తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే అందుకు కూడా తాము సిద్ధమని అభిప్రాయపడ్డారు.