నందుల రచ్చ.. పవన్ క్లైమాక్స్..!

 

నంది అవార్డులపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను ప్రకటించిన అవార్డులు న్యాయబద్దంగా జరగలేదని.. ఏక పక్షంగా వ్యవహరించారని పలువురు తప్పుబట్టారు. పెద్ద నిర్మాతలు నల్లమలపు బజ్జి, బండ్లా గణేష్, డైరెక్టర్ గుణ శేఖర్ లాంటి వాళ్లయితే బహిరంగంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కొంత మంది అయితే ఈ అవార్డులకు కులాల పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇక ఆ రోజు నుండి ఈరోజు వరకు నందుల రగడ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని.. ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదని పలువురు అన్నా.. మెగా కాంపౌండ్ నుండి మాత్రం ఒక్క మాట కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ వార్త బయటకు వినిపిస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ నంది అవార్డుల గొడవపై ఎలా స్పందిస్తాడు అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే.. ఈ అవార్డుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా పవన్ క్లైమాక్స్ పంచ్ వేస్తాడని అంటున్నారు. దీంతో అవార్డులపై పవన్ ఎలా స్పందిస్తాడా..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇంతవరకూ సైలెంట్ గా ఉన్న మెగా కాంపౌండ్ నుండి పవన్ గొంతైనా వినిపిస్తుందా..? లేక ఎప్పటిలాగానే నాకెందుకులే అని లైట్ తీసుకుంటాడా అని చూద్దాం.. ఏది ఏమైనా.. ఈ రచ్చతో.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో లోపల ఉన్న కుల కుమ్ములాటలు ఒక్కసారిగా బయట పడ్డాయని చెప్పొచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu