పాలిటిక్స్ చాలా కాస్ట్‌లీ.. వేతనం సరిపోవట్లేదు : కంగనా రనౌత్
posted on Jul 12, 2025 3:04PM

ప్రస్తుత రాజకీయాలపై హిమాచల్‌ప్రదేశ్ మండి ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలు ఖర్చుతో కూడినవి అని ఎంపీ జీతం సరిపోవటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో ఉండే సిబ్బందికి శాలరీలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని అన్నారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశం కనీసం 300 నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే చాలామంది లోక్ సభ్యులకు బిజినెస్ లు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం అవుతుంది కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమన్నారు.