చిన్నారి మోక్షజ్ఞని తండ్రే చంపేశాడా?
posted on Dec 27, 2014 3:30PM

హైదరాబాద్‌కి చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి నుంచి నీటిలోకి విసిరేసి చంపేసిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ బాబాయి గోడపాటి హరిచరణ్ ఈ చిన్నారిని నదిలోకి విసిరేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇదిలా వుండగా ఈ కేసులో ఊహించని మలుపు వచ్చింది. తన కుమారుడిని తన భర్తే ఇతర కుటుంబ సభ్యులతో కలసి చంపించి వుంటాడని మోక్షజ్ఞ తల్లి విమల అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి వుందని, మోక్షజ్ఞ తండ్రి కీడుతో పుట్టాడని జ్యోతిషులు చెప్పారని, ఆ అంశాన్ని మనసులో పెట్టుకుని తన భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలసి మోక్షజ్ఞను చంపించి వుంటాడని ఆమె తెలిపారు. మోక్షజ్ఞ తల్లిదండ్రులు విమల ప్రియ, భాస్కరరావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరు మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. ఇప్పుడు ఈ ఘోరం జరిగింది. ఈ కేసు విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.