ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు?
posted on Feb 24, 2025 3:38PM
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న రాజాసింగ్ కు గతంలో బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ దేశాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆదివారం మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు రాజాసింగ్ చెప్పారు. మోదీ, యోగీ ఆదిత్యనాథ్ తమను ఏం చేయలేరని నిందితులు ఫోన్ లో అన్నట్టు తెలుస్తోంది. రెండు వేర్వేరు నెంబర్లతో ఫోన్ లు వచ్చినట్టు రాజాసింగ్ చెప్పారు. రాజాసింగ్ కు గతంలో గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేశారు. అప్పట్లో రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ తల నరికేస్తాం ఇన్షియాల్లా అంటూ ఆయనపై అంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ వరుసగా మూడు పర్యాయాలు గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచారు. హైద్రాబాద్ నుంచి ఏకైక బిజెపి ఎమ్మెల్యేరాజాసింగ్ హత్య కుట్రకు దుండగులు ప్లాన్ చేసిట్టు తెలుస్తోంది. తాజాగా రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. హిందూ ధర్మ పరిరక్ఝణ కోసం తాను ఉద్యమిస్తే దుండగుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వాపోయారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని తెలుస్తోంది.