జుకర్ బర్గ్ అరుదైన వీడియో..

 

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్ అప్పుడప్పుడు తన ఫేస్ బుక్ ఖాతాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అవుతుంది. ఇంతకీ మార్క్‌ ఏం వీడియో పోస్ట్ చేశాడునుకుంటున్నారా..? ఆ వీడియో ఏమిటంటే ఆయన హార్వార్డ్‌ యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్న సందర్భంలోనిది. హార్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరీక్ష రాసి దరఖాస్తు చేసుకున్న జుకర్‌.. తనకు సీటు వచ్చిందో లేదో అని ఉత్కంఠగా తన ఇంట్లోని కంప్యూటర్‌ ముందు కూర్చుని సెర్చింగ్‌ చేస్తుంటాడు. అయితే మార్క్ టెన్షన్ పడుతుండగా.. ఆయన తండ్రి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియోనే మార్క్ జుకర్ బర్గ్ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా మరో ఐదు రోజుల్లో ఆయన హార్వార్డ్‌లో ప్రసంగించి డిగ్రీని అందుకోనున్నాడు.