TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిషన్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యాయత్నం

Published on: Thu May 28, 2015 11:31AM

ఓ వైపు సభ జరుగుతుంది మరోవైపు అందరూ నిశ్సబ్దంగా వింటున్నారు ఇంతలో ఓ యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నల్లొంగ జిల్లాలో 'ప్రజా పునరంకిత' సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి ఉన్న వారంతా ఉలిక్కిపడి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భాజపా నేత కిషన్ రెడ్డికి అయితే మాట పడిపోయి షాక్ కు గురయ్యారు. అక్కడ ఉన్న జీజేపీ కార్యకర్తలు మాత్రం ఆ యువకుడిని రక్షించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంత సేపటికి షాక్ నుంచి తేరుకున్నకిషన్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్ళి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.