మహానాడు వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ అస్వస్థత

 

కడప మహానాడు బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ స్పృహ తప్పిపడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న జలీల్ ఖాన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి టీడీపీ శ్రేణులు తరలించారు.  2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు జలీల్ ఖాన్. బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది అధికారంలోకి వచ్చింది. దీంతో జలీల్ ఖాన్‌తో పాటుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు.. అప్పట్లో టీడీపీలో చేరిపోయారు.

ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జలీల్‌ ఖాన్ స్థానంలో ఆయన కూతురు టీడీపీ తరుఫున పోటీ చేశారు. అయితే వైసీపీ తరుఫున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.. నాటి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ విపక్షంలో ఉండిపోయారు జలీల్ ఖాన్. ఇక 2024 ఎన్నికల్లో జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున టికెట్ ఆశించారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu