స్కాట్లాండ్ వేర్పాటుపై బ్రిటన్‌లో రెఫరెండం పూర్తి...
posted on Sep 18, 2014 12:56PM

బ్రిటన్ నుంచి వైదొలగాలని, స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వుండటంతో అక్కడ గురువారం నాడు రెఫరెండం జరిగింది మొత్తం బ్రిటన్‌లోని ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్కాట్లాండ్ బ్రిటన్‌లో వుండాలా వద్దా అనే ప్రశ్నకు ఎస్ ఆర్ నో చెప్పడం ద్వారా ప్రజలు స్కాట్లాండ్ భవితవ్యాన్ని తేల్చారు. అయితే ఫలితం శుక్రవారం వెల్లడిస్తారు. స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి విడిపోవడాన్ని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని కామెరూన్‌తోపాటు ఇతర ప్రముఖ రాజకీయ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే స్కాంట్లాండ్ ప్రజలు మాత్రం బ్రిటన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. రిఫరెండం కనుక స్కాట్‌లాండ్ విడిపోవడానికి అనుకూలంగా వస్తే మాత్రం బ్రిటన్ రాజకీయాలలో పెను మార్పులు రావొచ్చని తెలుస్తోంది.