ఇకనైనా విమర్శలు ఆపకపోతే తన్ని తగలేస్తాం.. కేటీఆర్
posted on Oct 20, 2015 10:48AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు కోపమొస్తే ఎలా తిడతారో అందరికి తెలిసిందే. చాలా సూటిగా.. నిక్కచ్చిగా.. ఏమాత్రం భయం కాని.. తడబాటు కాని లేకుండా తిడతారు. మరి తండ్రి పోలికలు కొన్నైనా కొడుకుకు రాకుండా ఉంటాయా. ఇప్పుడు కేటీఆర్ కూడా తన తండ్రిలాగే ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కేటీఆర్ నల్గొండ జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకోసం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి గాను కేటీఆర్ ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పై ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ప్రతిపక్షాలు నిరూపిస్తే వెంటనే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వచ్చే మూడేళ్లలో కనుకు తెలంగాణ ప్రజలందరకీ తాగునీరు అందిచకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని అన్నారు. అంతేకాదు ప్రతిపక్ష నేతలు ఇలాగే ఆరోపణలు కొనసాగించడం మంచిది కాదుని.. వారు మమ్మల్ని గౌరవిస్తే మేము వారినీ గౌరవిస్తాం. లేకుంటే వారిని తన్ని తగలేస్తాం అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.