తుమ్మల అసంతృప్తి?
posted on Sep 24, 2012 10:15AM
.png)
ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ అధినేత చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. 2010 నుంచి వర్గ విభేదాల వల్ల పార్టీ కేడర్ దెబ్బతింటూనే ఉంది. ఆ విషయం తెలిసినా ఏమీ చేయలేమన్న చంద్రబాబు వ్యవహభరిస్తూనే ఉన్నారు. పరోక్షంగా ఆయన ఎంపీ నామా నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తున్నారు. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వర్గం ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ తమకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు చేయకపోతే పార్టీని సైతం వదిలేసేందుకు వెనుకాడకూడదని తుమ్మల అనుచరులు భావిస్తున్నారు. వీలైతే తమ నేత తుమ్మలను కూడా పార్టీ నుంచి బయటకు తీసుకువచ్చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.తాజాగా తుమ్మల వర్గం నుంచి దరిపెల్లి కవిత తెలుగుమహిళ జిల్లా అథ్యక్షురాలిగా ఎంపికై అర్ధాంతరంగా పదవి నుంచి వైదొలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలానే మండల కమిటీల ఎంపికలోనూ రసాభాస జరిగి చివరికిపోలీసులు రంగప్రవేశం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఖాళీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంపిక పూర్తి చేయాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. జిల్లా వారీగా ఈ ఎంపిక పూర్తి చేయాలని అధిష్టానం భావిస్తోంది. అందులో కనుక ఏ వర్గానికి అన్యాయం జరిగినా కార్యకర్తలు ఇతరపార్టీలకు వలసవెళ్లే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు తీసుకునే నిర్ణయం కోసం ఖమ్మం జిల్లా తెలుగుదేశం కేడర్ ఎదురుచూస్తోంది.