కేబీఆర్ పార్కు కాల్పుల వెనుక ఉన్నదెవరు?

 

సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్కు కాల్పుల సంఘటన మీద పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్స్ ఆధారంగా పరిశోధన చేస్తున్నారు. ఈ సంఘటన వెనుక గతంలో సస్పెండైన గ్రేహౌండ్ పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో గ్రేహౌండ్స్ దగ్గర నుంచి ఏకే 47 గన్ మాయమైంది. ఆ గన్‌నే ఈ ఘటనలో ఉపయోగించారు. గ్రేహౌండ్స్ నుంచి సస్పెండైన వారు ఆ గన్‌ని మాయం చేసి, ఇలాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకు ఆ గన్‌ని ఉపయోగిస్తున్నారేమోన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu