కాజల్... మహా... కాస్ట్‌లీ గురూ...
posted on Dec 31, 2013 3:48PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్స్ పరంగా నెంబర్‌వన్ హీరోయిన్ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పేస్తాం సమంత అని. మరి రెమ్యునరేషన్ పరంగా అంటే... తడుముకునే వాళ్లం. అయితే కాజల్ పుణ్యమాని మనకా తడుముకునే అవస్థ తప్పింది. ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరోయిన్ అందుకోనంత రెమ్యునరేషన్ అందుకుంటూ కాజల్... కొత్త చరిత్రకు ఆజ్యం పోసింది. ఈ క్రేజీగాళ్... కమల్‌హాసన్‌తో ‘ఉత్తమ విలన్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కోసం ఏకంగా టాప్ హీరోతో సమానంగా రూ.2కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందని సమచారం.
అంతేకాదు... రామ్‌చరణ్, క్రష్ణవంశీల కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమా కోసం కూడా పెద్ద మొత్తాన్నే డిమాండ్ చేసి సాధించుకుందట. చందమామతో తనకు హిట్టొచ్చిందని క్రష్ణవంశీ, మగధీర, నాయక్ సినిమాల్లో తన సక్సెస్ జోడీ అని రామ్‌చరణ్... సెంటిమెంట్‌గా ఫీలవ్వడంతో... ఈ నాజూకు భామ అడిగినంత ముట్టజెప్పారట. ఈ రెండు సినిమాలకూ కాజల్ వసూళ్లు చూసిన సినీ జనం... నెంబర్‌వన్ అంటే ఇంకొకర్ని ఎలా చెప్పుకుంటాం అని అనుకుంటున్నారట. సినిమాల్లో నటించడంతో పాటు అవసరాన్ని, సెంటిమెంట్‌ను బాగానే మార్కెట్ చేసుకుంటున్న ఈ కాస్ట్‌లీ గాళ్... తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే అభిమానుల కోసం ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఇటీవలే రిలీజ్ చేసింది. అమ్మో... కాజల్... అసాధ్యురాలే.