కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు?

 

కేఏ పాల్.. ఒకప్పుడు మత ప్రభోదకుడిగా, శాంతి దూతగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్ లా మిగిలిపోయాడు.
అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి హేళనలు ఎదుర్కొంటున్నాడు. అసలు కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు? క్లుప్తంగా తెలుసుకుందాం.

కేఏ పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్ లోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారారు. దీంతో కేఏ పాల్ కి చిన్నతనం నుంచి జీసస్ ని పూజించడం అలవాటైంది. అయితే పాల్ చదువులో చాలా వెనుక ఉండేవాడు. పదో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. అతికష్టం మీద మూడో సారి పాస్ అయ్యాడు. తరువాత మళ్ళీ ఇంటర్ లో కూడా ఫెయిల్. ఆ టైం లో పాల్ చిన్న చిన్న పనులు చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకి ఎదిగేలా చేశాయి. టెన్త్ కూడా పాస్ కానీ పాల్ పట్టుదలతో ఇంగ్లీష్ బాష మీద పట్టు సాధించాడు. మత ప్రభోదకుడిగా మారిపోయాడు. అనతికాలంలోనే ప్రపంచదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకానొక టైంలో 20 నిమిషాల ఉపన్యాసానికి 20 కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బోయింగ్ 747 ఎస్పీ విమానం కూడా ఆయన సొంతమైంది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎందరో అనాధ పిల్లల్ని ఆదుకొని చదివించాడు, ఎందరో విదువరాళ్లకు ఆర్థికసాయం చేశాడు. అయితే అలా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్ రాజకీయాల పుణ్యమా అని కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏ పాల్ బలైపోయారు అంటుంటారు. కొందరు నాయకులు ఆయనను కోట్ల డబ్బులు ఇవ్వమని బెదిరించేవారట, కొందరైతే మత ప్రభోదనలు ఆపివేయాలని ఒత్తిడి తెచ్చేవారట. ఇలా రకరకాల ఒత్తిడులు, బెదిరింపులు.. మరోవైపు 2008 లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించాడు. తరువాత ఒత్తిడులు మరింత పెరిగాయి. దీంతో ఆయన ఆ రాజకీయ కుట్రలు, ఒత్తిడులు తట్టుకోలేక 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇంతలో సోదరుడిని హత్య చేశారన్న ఆరోపణలతో జైలు. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏ పాల్ చెప్తుంటారు. ఈ వరుస సంఘటనలతో పాల్ మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యారు. మత ప్రభోదనలకు దూరమయ్యాడు. ఒకప్పుడు విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టొచ్చిన ఆయన.. ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలతో 2019 ఎన్నికల్లో ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నువ్వుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఆయన్ని చూసిన వారు మాత్రం ప్రస్తుత ఆయన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.

Related Segment News