జూడాల ఆందోళన ఉద్ధృతం

 

శుక్రవారం నుంచి తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని పోలీసులు గురువారం తెల్లవారుఝామున తొలగించారు. ఇక్కడ ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధఇంచారు. దీంతో జూనియర్ డాక్టర్లు కోఠీలోని ఉస్మానియా వైద్య కళాశాలలో అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం వారు తమ డిమాండ్లు సాధించేవరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ట్యాంక్ బండ్ మీద బైఠాయించి నిరసనలు తెలపడానికి సిద్ధమవుతున్నామని, తమ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుందని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు తలవంచే ప్రసక్తే లేదని వారు ప్రకటించారు. అవసరమైతే ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఇంటి ముందు కూడా బైఠాయింపులు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వం తన చేతకానితనం వల్లే తమ మీద దాడి చేయించిందని తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఆరోపించారు.