నిశిత్ మృతిపై జేసీ...ధనికుల పిల్లలో విచ్చలవిడితనం పెరిగింది..

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతి నేపథ్యంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిశిత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన వేదనతో మాట్లాడుతూ.. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని అన్నారు. ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆయన ఆక్షేపించారు. పబ్ కల్చర్ మంచిది కాదని.. రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.. కొడుకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో  మృతి చెందారన్న వార్త జీర్ణించుకోవడం కష్టమని ఆయన స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu