సీఎం వస్తేనే జవాను అంత్యక్రియలు చేస్తాం...!
posted on May 3, 2017 11:40AM

పాకిస్థాన్ సైనికులు జరిపిన దాడుల్లో ప్రేమ్ సాగర్, పరమజిత్ సింగ్ అనే ఇద్దరు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పాక్ సైనికలు చేతిలో అతి దారుణంగా చిత్రవధ చేయింపబడ్డారు. అయితే ఇప్పుడు జవాను ప్రేమ్‌సాగర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ ఇంటికి వచ్చి ప్రేమ్‌సాగర్ కు నివాళులు అర్పిస్తే కానీ దహన సంస్కారాలు చేయబోమని తెలిపారు. అంతేకాదు.. జవాను పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన యోగి జవాను కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 13వ రోజు నిర్వహించే కర్మకు తప్పకుండా హాజరవుతానని, ప్రేమ్‌కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చిన అనంతరం... అధికార లాంఛనాల మధ్య జవాను అంత్యక్రియలను నిర్వహించారు.