జస్వంత్ ‌సింగ్‌ సీరియస్

 

కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ ఆరోగ్యం మరోసారి సీరియస్ అయింది. గత సంవత్సరం ఆగస్టు 8వ తేదీన ఆయన తన ఇంట్లో జారిపడ్డారు. అప్పుడు తలకు గాయం కావడంతో కోమాలోకి వెళ్ళిపోయారు. నాలుగు నెలలపాటు న్యూరో సర్జన్ల పరిశీలనలో ఉన్న తర్వాత ఆయన కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే బుధవారం నాడు ఆయన మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం రావడంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దాంతో ఆయనను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu