నౌక మునిగి 54 మంది జల సమాధి

 

రష్యాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకొంది. 54 మంది ఒక్కసారిగా జలసమాధి అయ్యారు. సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం దక్షిణ మగదాన్ కు 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న కామ్ చట్కా తీరంలో ది దాల్సి వోస్తోక్ అనే నౌకలో మొత్తం 132 మంది ప్రయాణిస్తున్నారు. ఈ నౌక ఒక్కసారిగా మంచు గడ్లలను ఢీ కొట్టడంతో మునిగిపోయి అధిక ప్రాణనష్టం జరిగింది. సమాచారం అందిన వెంటనే సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని 63 మందిని కాపాడగా 54 మంది జలసమాధయ్యారు. మరో 15 మంది గల్లంతయ్యారు. ఈ నౌకలో ప్రయాణించే ప్రయాణికుల్లో 78 మంది రష్యన్ లుకాగా 40 మంది మయన్మార్, ఉక్రెయిన్, లిథువానియా, వాంచూ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు రష్యా ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu