లేడీ పోలీసుకు ఐక్యరాజ్య సమితి అవార్డు
posted on Oct 15, 2014 12:08PM

జమ్మూకాశ్మీర్‌కు చెందిన శక్తిదేవి అనేమ మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014’ అవార్డును పొందారు. కెనడాలోని విన్నిపెగ్‌లో ఇటీవల జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో జమ్మూకాశ్మీర్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ శక్తిదేవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అఫ్ఘానిస్థాన్‌లో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ శక్తిదేవి విధి నిర్వహణలో ఎన్నో విజయాలు సాధించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళా కౌన్సిళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపుల బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా శక్తిదేవికి ఈ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రదానం చేసింది.