జల్లికట్టుపై తమిళనాడు సీఎం భరోసా
posted on Jan 20, 2017 10:05AM
.jpg)
జల్లికట్టును కొనసాగించాలని ప్రజలు రోడ్లమీదకు రావడం వారికి మద్దతుగా నడిగర సంఘం నిలవడం..ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులో వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయమై రాజ్యాంగ నిపుణులతో చర్చించామన్నారు. దీనికి సంబంధించిన సవరణ ముసాయిదాను ఇవాళ ఉదయమే కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించామని, దానికి ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి వస్తుందని.. కొద్ది రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని..అందువల్ల ప్రజలు తమ నిరసనను విరమించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.