నేటి నుండి విశాఖ, తూ.గో.జిల్లాలలో జగన్ ఓదార్పు యాత్ర
posted on Jul 2, 2015 8:52AM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి మూడు రోజుల పాటు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో ఓదార్పు యాత్ర చేస్తారు. కానీ ఈయాత్ర తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి కాదు. వివిధ ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతారు.
ఆయన ఈరోజు ఉదయం 11.30 గంటలకి విశాఖకు వస్తారు. అక్కడి నుండి అచ్యుతాపురం వెళ్తారు. అక్కడ ధవళేశ్వరం బ్యారేజి వద్ద ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ మూడు రోజులలో ఓదార్పు యాత్రలో తూర్పు గోదావరి జిల్లాలో పెరుమల్లాపురం, హుకుంపేట గ్రామాలలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలను, ఆ తరువాత కొత్తపట్నం, రామన్నపాలెం, పరాడపేట, ఉప్పలంక, పగడాలపేట గ్రామాలలో మత్య్సకార కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రంపచోడవరంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 9మందికి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. జూలై 4న గోపాలపురం నియోజకవర్గంలోని దేవరాపల్లి పొగాకు రైతులతో సమావేశమవుతారు.అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు.