ఐసిస్ చీఫ్ బగ్దాదీ చనిపోయాడు..!
posted on Jul 1, 2017 11:28AM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ మరణించాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలింది. గత నెలలో రష్యా సమావేశానికి వచ్చిన ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. వందలాది మంది ఐఎస్ ఉగ్రవాదులు సమావేశమవ్వగా.. ఈ సమావేశానికి బగ్దాదీ కూడా హాజరైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడుల్లో బగ్దాదీ చనిపోయాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇలా ప్రకటన వెలువడ్డ ప్రతిసారీ ఏదోఒక రూపంలో బగ్దాదీ బతికి ఉన్నాడన్న ఆధారాలు లభ్యమయ్యేవి. ఈ దాడి తరువాత అలాంటివేవీ కనిపించలేదు. దీంతో బగ్దాదీ మరణించాడని ఇరాన్ మీడియా ప్రకటించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ తన కథనంలో బగ్దాదీ మరణించాడని ప్రకటించింది.