వాళ్ళిద్దరూ బెట్టింగ్ దోషులే

 

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బెట్టింగ్ కు పాల్పడ్డారని సుప్రీంకోర్డు నిర్ధారించింది. శ్రీనివాసన్‌పై ఆరోపణలకు మాత్రం ఆధారాలు లేవని తెలిపింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో శ్రీనివాన్‌కి ఈ కేసులో క్లీన్‌చిట్ వచ్చినట్టయింది. ఈ స్పాట్ ఫిక్సింగ్ కేసులో గత ఏడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న ద్విసభ్య బెంచ్ తీర్పును రిజర్వ్ చేసి గురువారం నాడు వెలువరించింది. 18 నెలల క్రితం ఐపీఎల్‌ క్రికెట్ టోర్నీలో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ఆరోపణలు వెలువడ్డాయి. కొందరు ఆటగాళ్ళు, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ జట్లకు సంబంధించిన వ్యక్తులతో ఫిక్సింగ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీని మీద దర్యాప్తు జరిగింది. ఫిక్సింగ్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఫిక్సింగ్ కేసును పూర్తి స్థాయిలో విచారించిన ముద్గల్ కమిటీ ఫిక్సింగ్‌లో బీసీసీఐలోని కొంతమంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉందని తేల్చి చెప్పింది. అలాగే శ్రీనివాసన్ బీసీసీఐ లేదా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యజమాని.. ఈ రెండిట్లో ఏ పదవిలో ఉండాలో తేల్చుకోవాలని సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu