అబ్బాయిలు అమ్మాయిలు తన్నుకున్నారు

 

అబ్బాయిలు అమ్మాయిలు రోడ్డుమీదే ఒకరికొకరు తన్నుకున్నారు. పోటీ పడి మరీ తన్నుకున్నారు. అది కూడా ఆనందంగా. తన్నుకోవడమేంటి, ఆనందంగా ఏంటీ అనుకుంటున్నారా. అసలు సంగతేంటంటే.. అంతర్జాతీయ పిల్లో ఫైటింగ్ డే సందర్భంగా లండన్ లోని ట్రాఫల్గర్ స్వ్కేర్ లో వేలాదిమంది మహిళలు, పురుషులు, చిన్నారులు రోడ్లపైకి చేరి మెత్తని దిండ్లతో ఫైటింగ్ చేశారు. దిండ్లు చిరిగేలా ఒకరినొకరు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. ఈ పోటీ లండన్ లోనే కాకుండా చాలా దేశాల్లో నిర్వహిస్తున్నారు. పైగా ఒత్తిడి తగ్గడం కోసం, నలుగురితో కలవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అంటున్నారు నిర్వాహకులు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu