ఉద్యోగాలిస్తామంటూ ఫ్లిప్‌కార్ట్ మోసం..!
posted on May 25, 2016 5:13PM

ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై పెను వివాదం రేగుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన విద్యార్దులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీనిపై కంపెనీ స్పందిచడం లేదు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారంటూ మండిపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర కంపెనీల మంచి ఉద్యోగావకాశాలను వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ విద్యార్ధుల తరపున ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ తదితరులకు మెయిల్ కూడా చేశారు.