డబ్బు కోసం భార్యతో గడిపిన వీడియో లైవ్ టెలికాస్ట్

డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు..తల్లిదండ్రులనైనా, తోబుట్టువులనైనా, సన్నిహితులనైనా, చివరికి కట్టుకున్న వారినైనా వంచించడానికి వెనుకాడరు. ప్రతి నిత్యం మన చుట్టూ ఇలాంటి వార్తలు ఎన్నో చూశాం..ఇంకా చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా టార్గెట్ మాత్రం డబ్బే. వీటన్నింటికి భిన్నంగా భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియోని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించాలనుకున్నాడు ఒక పైశాచిక భర్త. పోలీసుల్నే ఖంగు తినిపించిన ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే. హైదరాబాద్‌కు చెందిన వివాహిత నగ్న దృశ్యాలు గతేడాది నవంబర్‌లో ఆన్‌లైన్‌లో కనిపించాయి. వాటిని ఆమె సన్నిహితులు చూసి బాధితురాలికి చెప్పడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

దర్యాప్తు చేసిన పోలీసులకు ఆమె భర్తే నిందితుడని తేలడంతో కళ్లు బైర్లు కమ్మాయి. జీడిమెట్ల చింతల్ ప్రాంతానికి చెందిన శాడిస్టు భర్త నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇతనికి ఆన్‌లైన్‌లో అశ్లీల దృశ్యాలు చూడటం అలవాటు.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనకు తోడు, ఆర్థిక సమస్యల్ని తొలగించుకునేందుకు మగ వ్యభిచారిగా మారి తన మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం భార్యకు తెలియడంతో బుద్ధిగా ఉంటానని చెప్పాడు..ఈ క్రమంలో తన భార్య ద్వారానే డబ్బు సంపాదించాలని ప్లాన్ గీసి..పడక గదిలో భార్యకు తెలియకుండా ల్యాప్‌టాప్‌లో వెబ్‌క్యామ్ ఆన్ చేసి లైవ్ స్ట్రీమ్ వీడియో చాటింగ్ పోర్న్‌సైట్‌కు అనుసంధానం చేశాడు.

 

ఆ సైట్‌లో సుమారు 3 వేల మంది సభ్యులున్నారు. ఆ వీడియోకి వచ్చే వ్యూస్‌ని బట్టి టోకెన్లు కొనుగోలు చేయాలి. ఆ టోకెన్ల సొమ్మును వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తికి నిర్వాహకులు పంపిస్తుంటారు. అయితే లైవ్ స్ట్రీమ్ వీడియో చాటింగ్‌లో మెంబరైన ఒక వ్యక్తి బాధితురాలి వీడియోని డౌన్‌లోడ్ చేసి దానిని వేరే పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు..సదరు వీడియోని చూసిన ఆమె స్నేహితుల సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం డొంక కదిలింది. సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సో డబ్బు కోసం ఇలాంటి వాటికి తెగించే ఎంతో మంది మన చుట్టూనే ఉంటారు బీ కేర్ ఫుల్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu