దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు
posted on Jul 18, 2025 8:45AM
.webp)
తీవ్రమైన ఉక్కపోతతో గత కొన్ని రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (జులై 18) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో శుక్రవారం దక్షిణ కోస్తా, రాయల సీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలు ఉంటాయని పేర్కొంది.
ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అలాగే గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలలో కూడా చెదురుమదురు వానలు కురుస్తాయని పేర్కొంది.