చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుమల ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రద్దీ, ప్రయాణీకుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు తిరుమతికి వివిధ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది.  ఈ రైళ్లు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం పాట్నా మార్గంలో నాలుగు రైళ్లు నడుస్తాయి.

 అలాగే జులై 28నుంచి ఆగస్టు 18 వరకు  ప్రతి సోమవారం  పాట్నా-ఎర్నాకుళం మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయి. ఇక ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి - చర్లపల్లి  మార్గంలో నాలుగు రైళ్లు, అలాగే ఆగస్టు 4నుంచి 25వరకు  ప్రతి సోమవారం  చర్లపల్లి - తిరుపతి  మార్గంలో  నాలుగు రైళ్లు నడుస్తాయి.  తిరుమలకు వెళ్లే ప్రయాణీకుల రద్దీ ని తట్టుకునేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు.