ఏపీ నెంబర్ వన్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి..

 

కొంత మంది పార్టీ నేతలు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పడమే కాని చేతల్లో చేసేది మాత్రం ఏముండదు. అలాంటి నేతల పేర్లు మాత్రం జనాలకు బాగా గుర్తుంటాయి. కానీ కొంతమంది నేతలు మాటలు కాకుండా.. తమ పని తాము చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారి పేరు మాత్రం బయట చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. అలాంటి కోవకు చెందిన ఆమెనే ‘గుండా లక్ష్మీదేవి’’. ఈమె పేరు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆసక్తికరంగా మారారు. దానికి కారణం అత్యుత్తమ ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై జరిపిన సర్వేలో  ఆమె నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడమే.

గుండా లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో  శ్రీకాకుళం టౌన్ నియోజకవర్గ నుండి పోటీ చేసి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విజయం సాధించారు. అప్పటి నుండి నియోజక వర్గం అభివృద్ధి కోసం కృషిచేస్తూ.. ఏపీలో ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయటంతో పాటు.. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించటంలో ఆమె ముందున్నట్లుగా తేల్చారు. దీంతో ఇప్పుడు ఆమె ప్రముఖంగా మారారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ రెండో స్థానంలో.. మంత్రి అచ్చెన్నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే మొదటి ఐదు ర్యాంకుల్లో మూడు ర్యాంకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం. ఇక మిగిలిన మంత్రులు.. పలువురు నేతలు యాభై ర్యాంకు తర్వాత ఉన్నారు. దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు వారికి క్లాస్ పీకి అంతటితో ఊరుకుంటారా.. లేక మంత్రి వర్గం మార్పు గురించి ఆలోచిస్తారా అన్నది ప్రశ్న..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu