కేసీఆర్ సచివాలయానికి వచ్చారా? అదీ వార్తే..!



సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లినా వార్తే.. వెళ్లకపోయినా వార్తలాగే తయారైంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఒకటిగా ఉన్న సచివాలయం కాస్త రెండుగా చేసి మధ్యలో కంచె కూడా వేశారు. అయితే ఎవరి సచివాలయం నుండి వారు పాలన చేస్తూ.. ఇద్దరు సీఎంలతో సచివాలయం బిజీగా ఉంటుందేమో అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా మారింది పరిస్థితి.

వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్ ఆ నెపంతో అసలు సచివాలయంవైపు కన్నెత్తి చూడటమే మానేశారు. ఇప్పటికే కేసీఆర్ సచివాలయానికి వచ్చి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం సెక్రటేరియట్ కు రావడంతో పలువురు ఆసక్తిగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు కేసీఆర్ సీఎంవోకు వచ్చారంటూ వార్తను కూడా పెద్ద ఎత్తున ప్రచురించారు. ఇక చంద్రబాబు అయితే విజయవాడ నుండే తన పాలన కొనసాగిస్తున్నారు. మొత్తానికి సీఎంలు తమ కార్యలయానికి రావడం కూడా ఒక వార్త అయ్యే పరిస్థితి ఏర్పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu