చదువుతో పాటు విజ్ణానం.. విద్యార్థుల కోసం ఆ గురువు ఏం చేశాడో తెలుసా?

సెలవు దినాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ కుటుంబం తో గడపాలని, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్  టీచర్  రూటే సెపరేటు. గురువుగా తన విద్యార్థులకు విజ్ణాన బోధతో పాటు వినోదం, విహారలతో విషయపరిజ్ణానం అందించాలని భావిస్తారు. అందుకే సెలవులలో విద్యార్థులను తన సొంత ఖర్చులతో  విజ్ణాన యాత్ర కు తీసుకెళ్లారు. ఈ అనుభవం ఆ విద్యార్థుల కు జీవితం కాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆయన చెప్పారు. ఒక అపురూప జ్ణాపకంగానే కాకుండా.. విజ్ణానాన్ని అందించి, వారిలో అవహాగన, ఆలోచనా పెంపొందడానికి కూడా దోహదపడేలా ఆ యాత్రను మలిచారు. వివరాల్లోకి వెడితే.. 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాటిమీదిగూడెం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్షేత్ర సందర్శన కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు గోపినాథ్ నిర్వహించారు. వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థులకు ప్రత్యేక వికాసాన్ని అందించే లక్ష్యంతో గూడూరు మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వారిని తీసుకువెళ్లి అక్కడ నిర్వహించే కార్యకలాపాల గురించి వివిరంచి అవగాహన కల్పించారు.

విద్యార్థులను క్షేత్ర సందర్శనలో భాగస్వామ్యులను చేయడం వలన వారి ఆలోచనా విధానం మారడానికీ, తద్వారా వారిలో   విషయ పరిజ్ఞానం పెంపొందేకు  దోహపడుతుందనే ఆలోచనతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలీపారు.  క్షేత్ర సందర్శనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి, బ్యాంకులు, మీసేవా కేంద్రాలు, పోలీస్‌స్టేషన్‌లు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యార్థులను తన స్వంత ప్రయాణ ఖర్చులతో  తీసుకువెళ్లినట్లు గోపినాథ్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అందే సేవల గురించి, 108 ఉపయోగం గురించి, మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవల విదానం గురించి, ప్రజల రక్షణ కొరకు అమలులో ఉన్న చట్టల గురించీ ఈ క్షేత్ర సందర్శనలో వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu